Business idea small: ప్రభుత్వ ఉద్యోగం వదిలి వ్యాపారం లోకి లక్షల ఆదాయం


 బీహార్ (Bihar) ఆరోగ్య శాఖలో హెల్త్ ఆఫీసర్‌గా పని చేసేవాడు.. నెలకు రూ.50 వేలు సంపాదించేవాడు.. అయితే వ్యాపారవేత్తగా రాణించాలనేది అతని చిన్న నాటి కల.. దీంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి తన కల వైపు నడిచాడు.. చేప పిల్లల పంపిణీదారుగా మారి నెలకు ఏకంగా రూ.2 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఔరంగాబాద్‌కు చెందిన ప్రకాష్ కుమార్ సింగ్ కథ స్థానికంగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. అతడు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నప్పుడు అవమానించిన వారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. 

నవీనగర్ బ్లాక్‌లోని రాజ్‌పూర్ నివాసి ప్రకాష్ బీహార్ ఆరోగ్య శాఖలో హెల్త్ ఆఫీసర్‌గా పని చేసేవాడు. నెలకు రూ.50 వేలు సంపాదించేవాడు. అయితే వ్యాపారం చేయాలనేది అతడి కోరిక. ఉద్యోగంలో భాగంగా ప్రకాష్ నాలుగేళ్ల క్రితం ఓ డాక్టర్‌ను కలిశాడు. ఆ డాక్టర్ హేచరీ నడుపుతూ చేప పిల్లలను ఉత్పత్తి చేసేవారు. ఆయన నుంచి సమాచారం సేకరించి రూ.30 లక్షల పెట్టుబడి పెట్టి  ప్రకాష్ కూడా హేచరీ ప్రారంభించాడు. ప్రకాష్ హేచరీలో బంగుర్, రూప్ చందా, రోహు, కట్ల, సిల్వర్ కార్ప్ వంటి పలు రకాల జాతుల చేపలు ఉత్పత్తి అవుతాయి

Published by: Srikanth B

No comments

New business idea :50 వెలతో బిజినెస్ మంచి లాభాలు బ్యాంక్ నుండి లోన్ 40%సబ్సిడీ కూడా

మంచి లాభాలు మీరు వ్యాపారం చెయ్యడానికి బ్యాంక్ నుండి లోన్ కూడా ఇస్తుంది తక్కువ స్థలంలో కూడా పెట్టుకోవచ్చు మీరు మంచి వ్యాపారం చెయ్యాలి అనుకుంట...

Powered by Blogger.